An old lady with ENT doctor
| |

Tips to manage ENT health in Senior Citizens (Telugu)

వృద్ధాప్యంలో గొంతు, చెవి, ముక్కు మరియు గొంతును ఆరోగ్యంగా వుంచుకోవడమెలా??

వయస్సు పెరిగే కొద్దీ, మన శరీరం అనేక మార్పు లకు లోనవుతుంది, చెవి, ముక్కు మరియుగొంతు (ENT) కూడా అందుకు మినహాయింపు కాదు. చాలా మంది వృద్ధులు వినికిడి తగ్గడం,సైనస్ సమస్యలు, గొంతు సమస్యలు మరియు ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. అయితే, సరైన సంర క్షణ మరియు నివారణ చర్యలతో, వృద్ధులు ఆరో గ్యాన్ని కాపాడుకోవచ్చు. మెరుగైనజీవనాన్ని అనుభ వించవచ్చు. వయసు పెరిగే కొద్దీ ముక్కు, చెవులు, గొంతు ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ ఇస్తున్నాను.

An old lady with ENT doctor

చెవి ఆరోగ్యం

Loud noise

మీ వినికిడిని కాపాడుకోండి.


శబ్దాలకు దూరంగా ఉండండి మరియు అవసరమైనప్పుడు వినికిడి రక్షణను ఉపయోగించండి.

రెగ్యులర్ చెవి శుభ్రపరచడం,

అధిక గుబిలి(వ్యాక్స్) చేరడం వినికిడి సమస్యలకు దారితీస్తుంది. దీని తొలగింపు కోసం కాటన్ స్వాబ్‌లను ఉపయోగించే బదులు సురక్షిత wax తొలగింపు కోసం డాక్టర్‌ను సంప్రదించాలి

వినికిడి పరీక్షలు.

వినికిడి కోల్పోయే ప్రమాదాన్నిగుర్తించడానికి రెగ్యులర్ వినికిడి పరీక్షలను చేయించుకోవాలి.

చెవి ఇన్‌ఫెక్షన్

చెవి నొప్పి లేదా డిస్చార్జ్ (pus) ఉంటే, సమస్యలను నివారించడానికి వైద్య సలహా తీసు కోవాలి.

సాధారణ నివారణ చర్యలు

రెగ్యులర్ ENT చెక్అప్‌లు చేయించుకొవాలి.. క్రమం తప్పకుండా ENT నిపుణుడి వద్దకు వెళ్ళి అవసరమైన చికిత్స చేయించుకోవాలి‌.

ఆరోగ్యకరమైన పోషకాలతో సమృద్ధిగా, సమతుల్యంగా వుండే‌ ఆహారం తీసుకోవాలి. వైద్యుడు సూచనలను పాటించాలు.

ENT సంబంధిత రోగాలకు, సమస్యలకు సకాలంలో సరైన వైద్యంపొందాలి‌‌. చెవి, ముక్కు లేదా గొంతు మందులను తీసుకునే ముందు ఎల్లప్పుడూ డాక్టర్‌ను సంప్రదించడం అవసరం‌.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *